Telangana,hyderabad, అక్టోబర్ 9 -- హైదరాబాద్ నగరంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈగల్ టీమ్ పోలీసులు చేపట్టిన సోదాల్లో భారీగా(220 కేజీలు) ఎఫ్రిడిన్ పట్టుబడింది. దీని విలువు రూ. 72 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాదకద్రవ్యాల తయారీలో ప్రధాన నిందితుడిగా శివరామకృష్ణ ఉన్నట్లు గుర్తించారు. ఇతనిది ఏపీలోని కాకినాడ కాగా. మరికొందరితో కలిసి ఈ దందా చేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఇక ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగంచినట్లు గుర్తించారు. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములా సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం బొల్లారంలో ఉపయోగించిన యూనిట్ కూడా సీజ్ చేశారు.ఈ కేసులోని ప్రధాన నిందితుడిపై 2017, 2019 సంవత్సరాల్లో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కేసు...