భారతదేశం, మే 11 -- తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ నివాసం నుంచి విడుదల చేశారు. ఈసారి అభ్యర్థుల సెల్‌ఫోన్లకు నేరుగా ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన భరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సాకేత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. అయితే.. ఇంటి నుంచే ఫలితాలను విడుదల చేయడంపై మాజీమంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. సీఎంపై విమర్శలు గుప్పించారు.

'ఈఏపీసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈఏపీసెట్ ఫలితాలను.. తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి విడుదల చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావా...