భారతదేశం, అక్టోబర్ 1 -- ఆటో రుణాలు, గృహ రుణాల ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు వాహనాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నాయి. అయితే, ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందా? రుణ గ్రహీత కిస్తీలు చెల్లించకపోతే, ఆ మొబైల్‌ను రిమోట్‌గా లాక్ చేసే అధికారాన్ని బ్యాంకులకు ఇవ్వాలా? అనే విషయంపై బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

ద్రవ్య విధాన సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ "మొబైల్ లాకింగ్ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా వస్తున్న అభిప్రాయాలను మేము పరిశీలిస్తున్నాం. ఈ అభిప్రాయాలన్నింటినీ మేం రికార్డు చేస్తున్నాం" అని తెలిపారు.

ఈ విషయంలో తమ ప్రాధాన్యతను గవర్నర్ స్పష్టం చేశారు. "డేటా గోప్యత (Data Privacy) విషయంలో సహా, వినియోగదారుల...