భారతదేశం, నవంబర్ 2 -- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. అత్యంత బరువైన LVM3-M5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా నింగిలోకి ఇది దూసుకెళ్లింది. ఈ వాహకనౌక CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఈ ప్రయోగం భారతదేశ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అంతరిక్ష సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతుంది. ఈ మిషన్ దేశ డిజిటల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమచారా ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బీట్‌లోకి ప్రవేశపెట్టారు.

శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం సాయంత్రం విజయవంతంగా ప్రయోగించారు. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ప్రకటన విడుదల చేశారు. ప్రయోగ సమయంలో వా...