భారతదేశం, ఏప్రిల్ 25 -- ఇస్రో మాజీ చీఫ్, జాతీయ విద్యా విధానం (NEP) ముసాయిదా కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.

కస్తూరి రంగన్ మృతిపై భారత ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశ శాస్త్రీయ, విద్యా ప్రయాణంలో ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ మహోన్నత వ్యక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కస్తూరి రంగన్ నాయకత్వం ప్రతిష్టాత్మక ఉపగ్రహ ప్రయోగాలను కూడా చూసిందని, ఆవిష్కరణలపై దృష్టి సారించిందని ప్రధాని మోదీ అన్నారు.

డాక్టర్ కస్తూరి రంగన్ ఇస్రో చీఫ్ గా, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తగా, దార్శనిక విద్యా సంస్కర్తగా విశేష సేవలను అందించారు. డాక్టర్ కస్తూరి రంగన్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమం, భారత నూతన విద్యా విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ''బెంగళూరులో...