భారతదేశం, జనవరి 12 -- శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్​పై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే.. ఉపగ్రహాల నుంచి కీలకమైన టెలిమెట్రీ డేటా అందడం లేదని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. మూడో దశలో డీవియేషన్​ కనిపించిందని, డేటాలను ఎనలైజ్​ చేస్తున్నామని వివరించారు. దీనివల్ల అసలు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయా లేదా అన్నది ఇప్పటికీ సందిగ్ధంగానే మారింది.

నిర్ణీత సమయం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు శ్రీహరికోట వేదికగా మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఇందులో 'అన్వేష' (ఈఓఎస్​-ఎన్​1) భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు మరో 14 చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే ప్రయోగం ముగిసిన తర్వాత శాస్త్రవేత్తల ముఖాల్లో ఆనందం కం...