Hyderabad, జూలై 21 -- లండన్‌లోని ఇస్కాన్ రాధాకృష్ణ దేవాలయంలో భాగమైన గోవిందా అనే వెజిటేరియన్ రెస్టారెంట్‌లో చికెన్ తిన్న వ్యక్తిపై బాలీవుడ్ టాప్ సింగర్, ర్యాపర్ బాద్ షా తీవ్ర విమర్శలు చేశారు. @JIX5A పోస్ట్ చేసిన వీడియోపై స్పందించిన బాద్‌ షా రెస్టారెంట్ లోపల మాంసం తినడమే కాకుండా సిబ్బందికి, కస్టమర్లకు అందించే ప్రయత్నం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వెజిటేరియన్ రెస్టారెంట్‌లో మాంసం తిన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆ గుర్తు తెలియని వ్యక్తి రెస్టారెంట్ సిబ్బంది వద్దకు వచ్చి 'ఇది శాకాహారి రెస్టారెంటా? అంటే మాంసం లేదా? మీరు కచ్చితంగా చెబుతున్నారా?" అని ఆ వ్యక్తి అన్నాడు.

దానికి సిబ్బంది పలుమార్లు ఇది వెజిటేరియన్ రెస్టారెంటే అని బదులు చెప్పారు. దాంతో ఆ వ్యక్తి కేఎఫ్‌సీ చికెన్ బాక్స్ తీసి తినడం ప్రారంభించాడు. దీంత...