భారతదేశం, జనవరి 11 -- ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వెబ్ సిరీస్ గురించి నెటిజన్లు తెగ డిస్కస్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ పేరు కనిపిస్తోంది. సస్పెన్స్ అదిరిపోయిందని, ట్విస్ట్ లో అదుర్స్ అంటూ పోస్ట్ లు వస్తున్నాయి. ఆ సీరీస్ ఏదో కాదు.. కానిస్టేబుల్ కనకం సీజన్ 2. ఈ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈ సిరీస్ సీజన్ గతేడాది ఓటీటీలోకి వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సీజన్ 2 కూడా అదరగొడుతోంది. ఈ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జనవరి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసింది.

కానిస్టేబుల్ కనకం సీజన్ 1లో టైటిల్ రోల్ ప్లే చేసింది వర్ష బొల్లమ్మ. కనక మహాలక్ష్మి ఓ స్టేషన్ కు కానిస్టేబుల్ గా వెళ్తుంది. అక్కడ ...