భారతదేశం, ఏప్రిల్ 21 -- ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇటీవలి కాలంలో పర్సనల్​ లోన్​లు ఎక్కువ తీసుకుంటున్నారు. మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ఒకవేళ అవును అయితే, లోన్ అప్రూవల్ కోసం మీ అవకాశాలను పెంచుకునేందుకు కొన్ని టిప్స్​ పాటించాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. మీరు మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసుకుని మెరుగుపరుచుకోవాలి: పర్సనల్​ లోన్​ కోసం బ్యాంకులు సాధారణంగా మీ క్రెడిట్ అర్హతను అంచనా వేయడానికి మీ క్రెడిట్ స్కోర్​ని ఉపయోగిస్తాయి. ఎక్కువ స్కోర్ ఉంటే లోన్ అప్రూవల్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాక, మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు తక్కువ వడ్డీ రేటు కోసం బేరసారాలు చేయవచ్చు. దీనికి విరుద్ధంగా, తక్కువ స్కోరు ఉన్న రుణ దరఖాస్తుదారులు రుణ ఆమోదం పొందడం కష్టం.

2. స్థిరమైన ఆదాయాన్ని కొనసాగించండి: సాధారణంగా బ్యాంకులు స్థిరమైన...