Hyderabad, జూన్ 22 -- తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తోన్న 'జ‌న నాయ‌కుడు' చిత్రాన్ని హిస్టారిక‌ల్ మూవీగా అంద‌రూ అభివ‌ర్ణిస్తున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న న‌టిస్తోన్న చివ‌రి చిత్ర‌మిది. అయితే, ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్ డే (జూన్ 22) సంద‌ర్భంగా మేక‌ర్స్ జన నాయకుడు ఫ‌స్ట్ రోర్‌ గ్లింప్స్‌ను ఇవాళ విడుద‌ల చేశారు.

ఇప్పుడీ జన నాయకుడు గ్లింప్స్ ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. విజయ్ చివ‌రి చిత్రం కావ‌టంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పల‌క‌టానికి బీజం చేసిన‌ట్లు గ్లింప్స్ రెడీ చేసినట్లు అర్థ‌మ‌వుతుంది.

ఇక 65 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న 'జ‌న నాయ‌కుడు' ఫ‌స్ట్ రోర్ వీడియోను గ‌మ‌నిస్తే.. 'నా హృద‌యంలో ఉండే..' అనే మాట‌లు విజ‌య్ వాయిస్‌లో మ‌న‌కు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్‌లో లాఠీ ప‌ట్టుకుని యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ప్ర‌దేశంలో న‌డుస్తూ వ‌స్తుంట...