Hyderabad, అక్టోబర్ 9 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వారంలో మొత్తంగా కలిపి ఎన్ని సినిమాలు ఉన్న గురు, శుక్ర వారాల్లో మాత్రం అధికంగా ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అవుతుంటాయి. అలానే ఇవాళ (అక్టోబర్ 09) గురువారం సుమారుగా పది వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

వాటిలో స్పెషల్‌గా చెప్పుకునే సినిమాల్లో ఒక తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా చిత్రం కూడా ఉంది. ఆ సినిమానే మేఘాలు చెప్పిన ప్రేమకథ. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు అయిన రాధిక, ఆమని అత్తాకోడలిగా నటించారు. హీరో నరేష్ అగస్త్యకు తల్లిగా ఆమని నటిస్తే నానమ్మగా రాధిక నటించింది.

అలాగే, కథానాయకుడికి తండ్రిగా సీనియర్ హీరో సుమన్ యాక్ట్ చేశారు. భార్యాభర్తలుగా ఆమని, సుమన్ నటించారు. మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమాకు స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వాన్ని విపిన్ అందించా...