భారతదేశం, నవంబర్ 22 -- ఓవైపు వరుస ఎన్ కౌంటర్లు. మరోవైపు అగ్రనేతల లొంగుబాట్లతో కకావికలం అవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 30 మందికిపైగా మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమయ్యారు. వీరిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

ఇవాళ లొంగిపోయే వారిలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటారని తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌తో పాటు కీలక సభ్యులుగా ఉన్న రమేష్‌, అప్పాశి నారాయణ, ఎర్రాలు లొంగిపోతారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంత మంది సభ్యులు లొంగిపోయేందుకు సిద్ధమైయ్యారని సమాచారం.

ఇటీవలే మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలను విడించారు. ఆయనే కాకుండా మ...