Telangana, జూన్ 5 -- ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ, రైతు భరోసా స్కీమ్ తేదీతో పాటు బనకచర్ల ప్రాజెక్ట్ తో పాటు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం స్కీమ్ శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ విషయంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో యువ వికాసం స్కీమ్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు కొనసాగుతున్నాయి. లబ్ధిదారులుగా ఎంపికైన వారికి మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ స్కీమ్ అమలుపై క...