Telangana,hyderabad, ఆగస్టు 28 -- తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వరద ఏరులై పారుతోంది. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది.

ఇవాళ కూడా మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.

మరోవైపు కామారెడ్డిలో మళ్లీ వర్షం మొదలైంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.బుధవార...