భారతదేశం, అక్టోబర్ 29 -- డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ, వైవిధ్యమైన యాక్టింగ్ తో అదరగొడుతున్నాడు హీరో ధనుష్. వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇప్పుడు తన సొంత డైరెక్షన్ లో హీరోగా చేసి మరో హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ సినిమానే 'ఇడ్లీ కడై'. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. థియేటర్లలో సత్తాచాటిన ఈ హార్ట్ టచింగ్ మూవీ ఇవాళ (అక్టోబర్ 29) ఓటీటీలో రిలీజైంది.

ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఇడ్లీ కడై ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. ఈ సినిమా బుధవారం నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి ఇడ్లీ కొట్టు రిలీజైంది. ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ గానూ వ్యవహరించాడు.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడ్లీ కడై మూవీ అక్టోబర్ 1, 2025లో థియేటర్లలో రి...