భారతదేశం, జనవరి 7 -- ఇవాళ ఓటీటీలోకి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ మూవీ వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమానే 'అయలాన్'. ఇది తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. భూమిపైకి వచ్చే ఏలియన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ ఏలియన్ కు హీరో ఎలా సాయం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అయలాన్ ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. ఈ సినిమా బుధవారం (జనవరి 7) నుంచి ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించారు. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగు ఓటీటీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఇప్పుడిక స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయొచ్చు.

అయలాన్ మూవీ రెండేళ్లకు ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ సినిమా 2024లో సంక్రాంతి స్పెషల్ గా రి...