భారతదేశం, నవంబర్ 4 -- ఓటీటీలోకి తమిళ కాంట్రవర్సీ మూవీ 'బ్యాడ్ గర్ల్' వచ్చేసింది. టీజర్ తోనే వివాదాన్ని రేపిన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే వివాదం కలకలం రేపింది. ఈ మూవీకి ప్రముఖ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ చూసేద్దాం.

తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా 'బ్యాడ్ గర్ల్' ఓటీటీలోకి వచ్చేసింది. వెట్రిమారన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (నవంబర్ 4) ఓటీటీలోకి వచ్చేసింది ఈ కాంట్రవర్సీ మూవీ. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి కథ, దర్శకత్వం వర్ష భరత్. ఆమెకు ఇదే దర్శకురాలిగా తొలి మూవీ. వర్ష ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ శిష్యు...