భారతదేశం, నవంబర్ 20 -- తమిళం నుంచి మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే 'నాడు సెంటర్' సిరీస్. ఇందులో తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి వారసుడు సూర్య విజయ్ సేతుపతి కీ రోల్ ప్లే చేశాడు. ఇది బాస్కెట్ బాల్ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామా సిరీస్ గా తెరకెక్కింది. ఇవాళ (నవంబర్ 20) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సిరీస్.

తమిళ వెబ్ సిరీస్ 'నాడు సెంటర్' ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌ స్పెషల్ సిరీస్ గా తెరకెక్కిన ఇది గురువారం నుంచి అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాళీ, మరాఠీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

పాఠశాలలో ఉండే టీనేజీ అల్లరి, గొడవలు, లవ్ అనే అంశాలు చుట్టూ సాగే సిరీస్ నాడు సెంటర్. ఇందులో బాస్కెట్ బాల్ ను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. ఈ సిరీస్ లో సూర్య ఎస్కే, రెజీనా...