భారతదేశం, డిసెంబర్ 2 -- ఓటీటీలోకి రష్మిక మందన్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వచ్చేసింది. హారర్ థ్రిల్లర్ గా తెెరకెక్కిన 'థామా' ఇవాళ (డిసెంబర్ 2) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రష్మిక మందన్న ఫస్ట్ టైమ్ నటించిన హారర్ థ్రిల్లర్ ఇది. ఇందులో బేతాళి పిశాచిగా నేషనల్ క్రష్ నటించింది. మంగళవారం ఓటీటీలోకి వచ్చిన థామా స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ ఉంది.

రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన థామా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హారర్ థ్రిల్లర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ప్రస్తుతానికి ఇది రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్లు కూడా దీని కోసం...