భారతదేశం, సెప్టెంబర్ 8 -- మరో కొత్త వారం వచ్చేసింది. కొత్త సినిమాలతో, ప్రెష్ రిలీజ్ లతో డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇవాళ (సెప్టెంబర్ 8) ఓటీటీలోకి తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మతో వచ్చే ఇబ్బందులు, భయం తదితర అంశాలతో తెరకెక్కిన 'బకాసుర రెస్టారెంట్' మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది.

తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ బకాసుర రెస్టారెంట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సోమవారం నుంచే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ ప్రవీణ్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. ఇప్పటికే స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. బకాసుర రెస్టారెంట్ ఆగస్టు 8న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోనూ విడుదలైంది ఈ హారర్ కామెడీ థ్రిల్ల...