భారతదేశం, నవంబర్ 15 -- ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. అతని లేటెస్ట్ రొమాంటిక్ మూవీ 'కె ర్యాంప్' థియేటర్లో అదరగొట్టింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కె ర్యాంప్ ఇవాళ (నవంబర్ 15) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వివరాలపై ఓ లుక్కేయండి.

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ సూపర్ హిట్ మూవీ కె ర్యాంప్ ఓటీటీలో అడుగుపెట్టింది. శనివారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. కడుపుబ్బా నవ్వించే రొమాంటిక్ కామెడీ మూవీ ఇది.

కె ర్యాంప్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీ డెబ్యూ చేసింది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 18, 2025న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. మంచి ఫన్ ఎలిమెంట్స్ తో పాటు రొమాన్స్ తో ఆడియన్...