భారతదేశం, డిసెంబర్ 12 -- లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ కాంత ఓటీటీలో అడుగుపెట్టింది. ఇవాళ నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కాంత చిత్రంలో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ సాధించింది.

ఓటీటీ లవర్స్ కు అదిరే న్యూస్. ఈ వీకెండ్ కు ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు సినిమాలు, సిరీస్ లు వచ్చేస్తున్నాయి. శుక్రవారం (డిసెంబర్12) చాలా ఓటీటీ రిలీజ్ లున్నాయి. ఇందులో ముఖ్యమైంది కాంత. ఈ మర్డర్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

తమిళ పీరియాడిక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అయిన కాంత నెల రోజుల్లోనే ఓటీటీలోకి ...