భారతదేశం, జనవరి 9 -- రుద్ర సికందర్ అఘోరాగా పవర్ ఫుల్ యాక్షన్ తో నందమూరి బాల‌కృష్ణ‌ అదరగొట్టిన మూవీ అఖండ 2. ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి పండగను ముందే తెస్తూ బాలయ్య ఫ్యాన్స్ ను డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎంటర్ టైన్ చేయనుంది. శుక్రవారం (జనవరి 9) నుంచి అఖండ 2 తాండవం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

నందమూరి బాల‌కృష్ణ‌ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అఖండ 2 డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

అఖండ 2 తాండవం డిసెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అయింది. బోయపాటి శ్రీనివాస్-నందమూరి బాల‌కృష్ణ‌ కాంబినేషన్లో వచ్చిన నాలుగో సి...