భారతదేశం, డిసెంబర్ 18 -- ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ రూరల్ లవ్ స్టోరీ వచ్చేసింది. థియేటర్లలో అదరగొట్టిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడని సీన్లతో అంటే ఎక్స్ టెండెడ్ కట్ తో ఇవాళ (డిసెంబర్ 18) ఓటీటీలోకి అడుగుపెట్టింది రాజు వెడ్స్ రాంబాయి. ఇదో విలేజ్ లవ్ స్టోరీ.

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగున్న మూవీస్ ను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇలా చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. థియేటర్లలో సత్తాచాటిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ఓటీటీలో చూసేందుకు మరో ప్రత్యేకత ఉంది. అదే ఎక్స్ టెండెడ్ కట్. అంటే థియేటర్లో లేని కొన్ని సీన్ల...