భారతదేశం, డిసెంబర్ 17 -- వరల్డ్ వైడ్ గా డిజిటల్ ఆడియన్స్ మనసులు గెలుచుకున్న అత్యంత పాపులర్ సిరీస్ లో సీజన్ 2 వచ్చేసింది. క్రేజీ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ఫాల్అవుట్ కొత్త సీజన్ ఓటీటీలో రిలీజైంది. ఇవాళ (డిసెంబర్ 17) నుంచి ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్ 2 స్టోరీ ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.

పాపులర్ వెబ్ సిరీస్ ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీలో అడుగుపెట్టింది. బుధవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన ఫాల్అవుట్ సీజన్ 2 ఇదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఫాల్అవుట్ సీజన్ 2లో మొత్తం 8 ఎపిసోడ్లున్నాయి. సీజన్ 1 వచ్చిన 20 నెలల తర్వాత సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ అవుతోంది. ఫస్ట్ సీజ...