భారతదేశం, జనవరి 13 -- థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ సంక్రాంతి మూవీ సందడి కనిపిస్తోంది. అటు బిగ్ స్క్రీన్ పై భారీ సినిమాలు ఆడియన్స్ కు పండగనిస్తే, ఇటు బుల్లితెరపై ఓటీటీ సినిమాలు థ్రిల్ కలిగిస్తున్నాయి. ఇవాళ ఓటీటీలో ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వచ్చేసింది. మర్డర్ చేయడం ఒక ఆర్ట్ అంటూ సాగే కథతో వచ్చిన ఆ మూవీనే 'కిల్లర్ ఆర్టిస్ట్'. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్ర పోషించింది.

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (జనవరి 13) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ మూవీ కేవలం రెంట్ విధానంలోనే ఉంది. అంటే ప్రైమ్ వీడియోలో ఈ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ చూడాలంటే రెంట్ పే చేయాల్సి ఉంటుంది.

కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ థియేటర్లలోకి రిలీజైన 9 ...