భారతదేశం, జనవరి 1 -- న్యూ ఇయర్ వచ్చేసింది. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి మొదలైంది. 2026ను సినీ లవర్స్ కు మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రెడీ అయ్యాయి. ఈ రోజు ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్ 'ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్' అడుగుపెట్టింది. తెలుగులోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

న్యూ ఇయర్ 2026ను మరింత స్పెషల్ గా మారుస్తూ, ఓటీటీ ఆడియన్స్ కు వెల్ కమ్ చెప్తూ కొత్త వెబ్ సిరీస్ ఇవాళ (జనవరి 1) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్ సిరీస్ గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది. ఇది పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్ సిరీస్ నాలుగు ఎపిసోడ్లతో ఓటీటీలోకి వచ్చింది. జియోహాట్‌స్టార్‌లో ఇవాళ సీజన్ 1లో నాలుగు ఎపిసోడ్లు రిలీజ...