భారతదేశం, డిసెంబర్ 26 -- మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'రివాల్వర్ రీటా'. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ తో, గ్యాంగ్ స్టర్ మర్డర్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సినిమానే రివాల్వర్ రీటా.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ గా తమిళంలో తెరకెక్కిన ఈ రివాల్వర్ రీటా సినిమా ఓటీటీలో తమిళంలో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలై కొద్ది వారాలకే ఓటీటీలోకి వస్తున్న అతి కొద్ది కొత్త తమిళ సినిమాలలో ఇది ఒకటి.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రివాల్వర్ రీటా ...