భారతదేశం, డిసెంబర్ 19 -- ఓటీటీలోకి ఈ వారం చాలా మంచి కంటెంటే వచ్చింది. తెలుగుతోపాటు వివిధ భాషల మూవీస్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి. ఇక ఆదిత్య మాధవన్, గౌరీ కిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మెడికల్ థ్రిల్లర్ 'అదర్స్' (Others) కూడా ఇందులో ఒకటి. శుక్రవారమే (డిసెంబర్ 19) ఓటీటీలో విడుదలైంది. ఐవీఎఫ్ (IVF) మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో నవంబర్ 7న విడుదలైన తమిళ థ్రిల్లర్ మూవీ 'అదర్స్'. ఆదిత్య మాధవన్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాలో '96', 'బేబీ' ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది కేవలం తమిళ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే స్ట్రీమింగ్ అవు...