భారతదేశం, డిసెంబర్ 16 -- డిఫరెంట్ స్టోరీ, కాన్సెప్ట్ తో సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి వస్తున్నాయి. డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా విభిన్నమైన కథాంశంతో ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది. అదే.. 'హార్ట్‌లీ బ్యాట‌రీ'. ఈ తమిళ సిరీస్ ఇవాళ (డిసెంబర్ 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

ఓటీటీలోకి మంగళవారం అడుగుపెట్టిన తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హార్ట్‌లీ బ్యాట‌రీ. ఈ రోజు నుంచి ఇది డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులో ఉంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఓటీటీలో హార్ట్‌లీ బ్యాట‌రీ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. జీ5 ఒరిజినల్ గా ఈ సిరీస్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతానికి కేవలం తమిళ భాషలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

హార్ట్‌లీ బ్యాట‌రీ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లు ...