భారతదేశం, డిసెంబర్ 5 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ (డిసెంబర్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల ప్రారంభంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. కథ కూడా ఆయనదే.

2025లో వరుస సినిమాలతో జోరుమీద ఉంది రష్మిక మందన్న. ఈ ఏడాదిలో ఆమె హీరోయిన్ గా చేసిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో చివరిది ది గర్ల్‌ఫ్రెండ్. థియేటర్లో అదరగొట్టిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ది గర్ల్‌ఫ్రెండ్.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు...