భారతదేశం, అక్టోబర్ 10 -- మిరాయ్ OTT రిలీజ్: తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కార్తీక్ ఘట్టమనేని ఫాంటసీ యాక్షన్ చిత్రం 'మిరాయ్' ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ఇవాళ (అక్టోబర్ 10) మిరాయ్ ఓటీటీ డెబ్యూ చేసింది.

తేజ సజ్జా హీరోగా యాక్ట్ చేసిన ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ మిరాయ్ ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్ గా నిలిచిన మిరాయ్ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో రిలీజైంది. గ్రాండ్ విజువల్స్, స్టోరీ లైన్, బ్లాక్ స్వార్డ్ గా మ...