భారతదేశం, ఆగస్టు 5 -- తమిళ సూపర్ హిట్ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా 'పరంతు పో' (Paranthu Po) సినిమా ఇవాళ (ఆగస్టు 5) ఓటీటీలోకి వచ్చింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతున్న ఈ సినిమాను తల్లిదండ్రులు, పిల్లలు అసలు మిస్ అవొద్దు. ఈ మూవీని ఓటీటీలో తప్పకుండా ఎందుకు చూడాలో తెలిపే 5 కారణాలు ఇక్కడ ఉన్నాయి. తెలుగులోనూ సినిమా అందుబాటులో ఉంది. పరంతు పో అంటే దూరంగా ఎగిరిపోవడం అని అర్థం.

జులై 4, 2025న థియేటర్లలోకి వచ్చిన పరంతు పో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ, గ్రేస్ ఆంటోని, మిథుల్ ర్యాన్, అంజలి, అజు వర్గీస్ తదితరులు నటించారు. ఒక పట్టణంలో నివసించే తండ్రి గోకుల్ (శివ), అతని ఎనిమిదేళ్ల కొడుకు అన్బు (మిథుల్ ర్యాన్) చుట్టూనే కథ తిరుగుతుంది. తల్లి గ్లోరీ (గ్రేస్ ఆంటోని) జాబ్ కోసం ...