భారతదేశం, జూలై 25 -- 28 డిగ్రీ సెల్సియస్, బ్లైండ్ స్పాట్, ఎలెవన్.. ఇలా వరుసగా ఓటీటీ సినిమాలతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ను ఏలుతున్నాడు నవీన్ చంద్ర. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ థ్రిల్లర్ తో ఓటీటీలోకి వచ్చేశాడు. ఆయన లేటెస్ట్ మూవీ 'షో టైమ్' (Show Time) ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. శుక్రవారం (జులై 25) నుంచి ఓటీటీలో ప్రసారమవుతుంది.

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన షో టైమ్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో రిలీజ్ అయింది. జులై 25న ఈ సినిమా సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీలో నవీన్ చంద్ర, రాజా రవీంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్ తదితరులు నటించారు. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

షో టైమ్ మూవీ ...