భారతదేశం, డిసెంబర్ 3 -- ఓటీటీలోకి ఈ వారం కూడా డిఫరెంట్ జోనర్లు, భాషల సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఓ కొరియన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన క్రిప్టో కరెన్సీ క్రాష్ కథతో తెరకెక్కిన 'క్రిప్టో మ్యాన్' మూవీ బుధవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

కొరియన్ సూపర్ హిట్ మూవీ క్రిప్టో మ్యాన్ ఇవాళ (డిసెంబర్ 3) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఫిక్షనల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. కొరియన్ భాషతో పాటు తమిళం, తెలుగు, హిందీలోనూ క్రిప్టో మ్యాన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఇది నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. కానీ కేవలం సౌత్ కొరియాలోనే అందుబాటులో ఉంది.

క్రిప్టో కరెన్సీ మోసాల ఆధారంగా క్రిప్టో మ్యాన్ మూవీ తెరకెక్కింది. ఇది జనవరి 15, 2025న...