భారతదేశం, నవంబర్ 13 -- ఈ వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ తో కూడిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టిన మూవీ 'ఎక్కా'. కేజీఎఫ్ స్టోరీ తరహాలో అమ్మ కల కోసం పోరాడే వ్యక్తిగా ఎక్కా సినిమా కథ సాగుతోంది. ఈ సినిమా గురువారం (నవంబర్ 13) ఓటీటీలో అడుగుపెట్టింది.

కన్నడ లేటెస్ట్ హిట్ మూవీ 'ఎక్కా' ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లోకి అడుగుపెట్టింది ఈ మూవీ. ఇందులో యువ రాజ్ కుమార్ హీరో. రోహిత్ పడాకి డైరెక్టర్. ఈ మూవీని పీఆర్కే ప్రొడక్షన్స్, జయన్నా ఫిల్మ్స్, కేఆర్జీ స్టూడియోస్ బ్యానర్లపై అశ్విని పునీత్, జయన్నా-భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగి రాజ్ నిర్మించారు.

కన్నడ యాక్షన్ థ్రిల్లర్ ఎక్కా సినిమా మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ జులై 18, ...