భారతదేశం, డిసెంబర్ 12 -- ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి నాలుగు తమిళ సినిమాలు వచ్చేశాయి. ఇందులో మూడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆరోమలే, థీయావర్ కులై నడుంగ, కాంత, కినారు సినిమాలు శుక్రవారం ఓటీటీలో అడుగుపెట్టాయి. ఇందులో కినారు మినహా మిగతా మూడు తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

తమిళ రొమాంటిక్ స్టోరీ ఆరోమలే. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్. కిషన్ దాస్ హీరోగా నటించాడు. హీరో లవ్ మ్యారేజీ చేసుకోవాలని ఆశపడుతుంటాడు. సినిమాల్లో చూపించినట్లుగా తన జీవితంలోనే మ్యాజిక్ జరగాలని కోరుకుంటాడు. కానీ వరుసగా లవ్ ఫెయిల్యూర్స్ ఎదురువుతాయి. అప్పుడే మ్యాట్రిమోనీ ఏజెన్సీలో చేరతాడు. అక్కడ బాస్ అంజలికి ఏమో లవ్ పై పెద్దగా నమ్మకం ఉండదు. మరి వీళ్ల మధ్య ఏం జరిగింది? అన్నది సినిమాలో చూడాల్సిందే. ఇది జియోహాట్ స్టార్ లో ఉంది.

సీనియర్ నటుడు అర్జ...