Andhrapradesh, ఆగస్టు 14 -- అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏపీలోని పలుచోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ అల్లూరి, కోనసీమ, ఏలూరు,ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

ఇక గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం ఉదయం రిపోర్ట్ ప్రకారం. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు,లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పంట్లు,నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని సూచించారు...