భారతదేశం, నవంబర్ 28 -- ఓటీటీలో కంటెంట్ అదిరిపోతే భాషతో సంబంధం లేదు. ఏ భాషలోని సినిమాలనైనా తెలుగు ఆడియన్స్ అలరిస్తూనే ఉంటారు. ఇవాళ అలాంటి అదిరిపోయే కంటెంట్ తో రెండు తమిళ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో ఒకటి ఆర్యన్ కాగా, మరొకటి ఆన్ పావమ్ పొల్లతత్తు. ఈ రెండు సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేయండి.

శుక్రవారం (నవంబర్ 28) ఓటీటీలోకి తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆర్యన్ వచ్చేసింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో విష్ణు విశాల్ లీడ్ రోల్ ప్లే చేశాడు. డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఆర్యన్ మూవీ.

ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఆర్యన్ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇది మర్డర్ మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్. అదిరిపోయే ట్విస్ట్ లతో...