భారతదేశం, జనవరి 2 -- పుస్తక ప్రియులకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ఇవాళ్టి నుంచి విజయవాడలో 36వ పుస్తక మహోత్సవం(బుక్ ఫెయిర్) ప్రారంభం కానుంది. జనవరి 12వ తేదీతో ఈ బుక్ ఫెయిర్ కార్యక్రమం ముగుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రతి ఏడాది నిర్వహించబోయే ఎన్నో వైవిద్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు బుక్​ఫెయిర్​కు వస్తాయి. తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ, ఎమెస్కో, తెలుగు బుక్స్​, సేజ్, పెంగ్విన్, నవయుగ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు అన్నీ ఒకే దగ్గర కనిపించనున్నాయి. విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాలతో బుక్​ఫెయిర్​ కొనసాగనుంది. ప్రతి ఏడాది జరిగే ఈ అతిపెద్ద పుస్తక మహోత్సవం కోసం పుస్తకప్రియులు ఎంతో ఆసక్తికగా ఎదురూచూస్తుంటారు. పుస్తకాలను కూడా భారీగానే విక్రయిస్తుంటారు. ఈసారి కూడా భారీగానే పు...