Telangana, జూన్ 18 -- తెలంగాణ టెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయి.

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

పరీక్షలు రాసే అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎగ్జామ్ సెంటర్ లోకి స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించవు. హాల్ టికెట్ తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటి అధికారిక ధ్రువపత్రాలను...