Hyderabad, ఆగస్టు 28 -- హనుమాన్ సినిమాతో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్‌గా చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ ట్రైలర్ ఇవాళ (ఆగస్ట్ 28)న విడుదలైంది.

ఆద్యంతం అదిరిపోయే విజువల్స్‌తో, యాక్షన్ సీన్స్‌తో మిరాయ్ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించింది. ట్రైలర్‌లో శ్రియా శరణ్, జగపతి బాబు, హీరోయిన్ రితికా నాయక్ తమ ప్రజెన్స్‌తో ఎంతె మెప్పించారు. యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్‌తో మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమాలా మిరాయి ఉంది.

అలాగే, మిరాయ్ ట్రైలర్ చివరిలో రాముడి సీన్స్ గూస్‌బంప్స్‌కు నెక్ట్స్ లెవెల్ అనిపించేలా ఉంది. హనుమాన్ క్లైమాక్స్ స్థాయిలో మిరాయ్ ఉంటుందనిపించేలా అంచనాలు పెంచేసింది మిరాయి. అయితే, ఇవాళే ట్రైలర్ రిలీజ్ కాగా అప్పుడే మి...