భారతదేశం, డిసెంబర్ 21 -- 15 వారాలు.. 105 రోజుల సంగ్రామం. ఎంతో మంది కంటెస్టెంట్లు. మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీలు.. చివరకు మిగిలేది ఒకే ఒక్కరు. నిలిచేది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరూ అనేది ఈ రోజే తేలిపోనుంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరో అనౌన్స్ అవుతుంది. ఆదివారమే గ్రాండ్ ఫినాలే.

బిగ్ బాస్ 9 తెలుగు సమరానికి క్లైమాక్స్. విజేత ఎవరో తేలే రోజు వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే ట్రోఫీని ముద్దాడే కంటెస్టెంట్ ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. డిసెంబర్ 21న రాత్రి 7 గంటల నుంచి ఫినాలే స్టార్ట్ అవుతుంది. జియోహాట్ స్టార్ ఓటీటీలోనూ ఈ ఫైనల్ ను చూడొచ్చు.

ఇప్పుడు అందరి ఫోకస్ బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు? అనేదానిపైనే ఉంది. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తోంది. హౌస్ లో టాప్-5లో నిలిచిన పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, సంజన గల్రానీ,...