Hyderabad, అక్టోబర్ 3 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో మంచి శుభ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీంతో చాలా రాశుల వారి జీవితమే మారిపోతుంది. ఈ యోగం 15 రోజులు పాటు ఉంటుంది. దీంతో నాలుగు రాశుల వారి జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది. ఎంతటి కష్టాల్లో ఉన్న బయటపడిపోవచ్చు. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

జ్యోతిష్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ప్రస్తుతం బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 3 అంటే ఈరోజు తులా రాశిలోకి ప్రవేశించాడు. దీంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడనుంది. అక్టోబర్ 7న బుధుడు యముడుతో కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నారు.

ఇది నాలుగు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అక్టోబర్ 24న బుధుడు వృశ్చిక రాశిల...