Andhrapradesh, ఆగస్టు 21 -- రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి... వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు.

సంక్రాంతి కల్లా మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు. బుధవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి....రాష్ట్రంలో ఇంకా ఇళ్లులేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. దీనిపై 15 రోజుల్లోగా సర్వ...