భారతదేశం, సెప్టెంబర్ 8 -- సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగానే ఒక గుడ్‌ న్యూస్. ఇటీవల జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల సిమెంట్, గ్రానైట్, టైల్స్ వంటి నిర్మాణ సామగ్రిపై జీఎస్‌టీ రేట్లు తగ్గాయి. దీంతో ఇల్లు కట్టుకునే ఖర్చు తగ్గుతుంది. కానీ ఈ ప్రయోజనం పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పన్నుల నిపుణులు సూచిస్తున్నారు.

మరి, ఈ కొత్త జీఎస్‌టీ సంస్కరణలతో ఇంటి నిర్మాణ ఖర్చు ఎంతవరకు తగ్గుతుంది? అపార్ట్‌మెంట్ కొనే దానికంటే సొంత ప్లాట్‌లో ఇల్లు కట్టుకోవడం చవకగా మారుతుందా? దీనిపై ఒక పూర్తి విశ్లేషణ చూద్దాం.

జీఎస్‌టీ కౌన్సిల్ 56వ సమావేశంలో సిమెంట్, మార్బుల్, గ్రానైట్ వంటి వాటిపై జీఎస్‌టీని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని న్యాయ నిపుణుడు శశాంక్ శేఖర్ అంటున్నారు. గతంలో సిమెంట్‌పై 28% ఉన్న పన్నును ఇప్పుడు 18%కి తగ్గి...