Hyderabad, ఏప్రిల్ 19 -- అద్దె ఇళ్లల్లోనే ఎక్కువ మంది నివసిస్తున్నారు. సొంతింటిని నిర్మించుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అయితే ఉద్యోగం, చదువులు, ఇతరత్రా కారణాల వల్ల చాలా మంది దూరప్రాంతాలకు వెళ్లి అద్దె ఇంట్లో ఉంటారు. అద్దెదారుడు మంచి ఇంటి కోసం వెతుకుతుండగా, ఇంటి యజమాని కూడా ప్రశాంతంగా జీవించే, అన్ని నియమాలను పాటించే అద్దెదారును కోరుకుంటాడు.

అయితే తరచూ ఇంటి ఓనర్లకు, అద్దెదారులకు మధ్య గొడవలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, ఇంటి యజమాని, అద్దెదారు. ఇద్దరూ వారి విధులు, హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి అద్దె నియంత్రణ చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అద్దెదారులు, ఇంటి యజమానుల హక్కులను రక్షించడానికి చట్టం ఉపయోగపడుతుంది. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని చట్ట...