భారతదేశం, జనవరి 7 -- ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన 'ది రాజా సాబ్' (The Raja Saab)లో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రభాస్‌తో పనిచేయడం, సినిమాలోని హైలైట్స్, ముఖ్యంగా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ది రాజా సాబ్ మూవీ చూశారా అని నిధిని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పింది. "డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూశాను. ఇందులో కామెడీ, రొమాన్స్, హారర్, ఫ్యాంటసీ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. మారుతి వీటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అయితే.. సెకండాఫ్, ముఖ్యంగా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. షూటింగ్ అప్పుడు మాకు పెద్దగా అర్థం కాలేదు కానీ, వీఎఫ్ఎక్స్ అన్నీ యాడ్ అయ్యాక అవుట్‌పుట్ చూసి షాక్ అయ్యాం. ఆడియెన్స్ కచ...