భారతదేశం, మే 2 -- ప్రతి మనిషికి జీవితంలో ఇతరుల సలహాలు అవసరం పడతాయి. అయితే ఎవరు పడితే వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోకూడదు, వాటిని పాటించకూడదని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.

కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా ఆచార్య చాణక్యుడిని పిలుస్తారు. అతను గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త , రాజకీయ నాయకుడు కూడా. ఆయన రచించిన చాణక్య విధానంలో జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు.

ఈ పుస్తకంలో, చాణక్యుడు కొంతమంది వ్యక్తుల గురించి పేర్కొన్నాడు, వారి నుండి సలహా తీసుకోవడం వ్యర్థమే కాదు ఎంతో హానికరం అని కూడా చెబుతున్నాడు. ఆచార్య చాణక్యుడు ఎవరెవరి నుంచి సలహాలు తీసుకోకూడదో ఇక్కడ వివరించారు.

చాణక్య విధానం ప్రకారం మూర్ఖుడికి తెలివితేటలు, వివేకం లోపిస్తాయి. అటువంటి వ్యక్తి సలహా ఆచరణ సాధ్యం కాదు. అలాగు అవి బెడిసి కొట్టి ఇబ్బందులకు గురి చేస్...