Hyderabad, ఏప్రిల్ 1 -- చాణక్యుడు చెప్పిన ప్రకారం జీవితంలో కొంతమందిని ఇంటికి పిలవకూడదు. వారి వల్ల మీకు కీడే కానీ మంచి జరుగదు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం 'అతిథి దేవో భవ' అంటారు. అంటే ఇంటికి వచ్చే అతిథులను భగవంతుని ప్రతిరూపంగా భావిస్తారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అల్పాహారం ఇవ్వడం, గౌరవించడం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం.

ఎవరైనా ఇంటికి వస్తే ఆనందంగా అనిపిస్తుంది. కానీ కొన్ని రకాల వ్యక్తిత్వం ఉన్నవారు మాత్రం ఇంటికి వస్తే మాత్రం మీ ఇంటికి మేలు జరగదు. మీ ఇంట్లో ఆనందం చెదిరిపోతుంది. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్లిన తరువాత కష్టనష్టాలు, ఇబ్బందులు వంటి వాతావరణం ఏర్పడితే వారిని ఇంటికి పిలవడం మంచిది కాదు.

మీరు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారికి ఇంటికి ఆహ్వానిస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయాన్ని ఆచార్య చాణక్యుడు ముందుగానే వివరించాడు....